త్వరలో 68వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 1.50 లక్షల ఇళ్లను డిసెంబర్ చివరి నాటికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 68వేల ఇళ్లను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించే చోట అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 81 వేల ఇళ్లు ఇచ్చినట్లు వెల్లడించారు.