న్యుమోనియాతో బాధపడుతున్న నెలన్నర పాపకు చికిత్స పేరుతో ఓ గ్రామ నర్సు వేడి ఇనుప కడ్డీతో 40 వాతలు పెట్టింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన షాదోల్ జిల్లాలోని హార్ది గ్రామంలో చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ దారుణానికి కారకులైన దాయి గ్రామ నర్సు బూటీ బాయి బాయిపై కేసు నమోదు చేశారు.