మా నమ్మకం నువ్వే జగన్న కార్యక్రమంలో భాగంగా మంగళవారంచుండూరు మండల పరిధిలోని వలివేరు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా లబ్ధిదారులు అందుకొన్న సంక్షేమ పథకాల వివరాలు తెలుపు డిస్ప్లే బోర్డును మంత్రి మేరుగ నాగార్జున ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గృహసారధులు, వలేంటీర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.