వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నేడు విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను పేదలకు వివరిస్తారు.