దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 8వేల దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద త్వరలోనే ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఇస్తామని అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈవోల నియామకం చేపట్టగా అందులో 54 మందికి అలాట్మెంట్ కూడా ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలోని రూ.539 కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల పునరుద్దరణ, కొత్త దేవాలయాలను నిర్మిస్తున్నామన్నారు.