తిరుపతి జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకట రమణారెడ్డి మంగళవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లా పరిధిలో ఈనెల 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది ఎదురైతే ఏ సమయంలోనైనా 87722 36007కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa