ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారమే టార్గెట్‌గా దేశాధినేతలు నేడు భారత్ నిర్వహించనున్న జీ – 20 సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ ని ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. గతేడాది సెప్టెంబర్ లో భారత్ అధ్యక్షతన జరిగిన జీ 20 వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం వచ్చిన ఫలితాలు, చర్యల ఆధారంగా అజెండా రూపొందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక స్థితి పునరుద్ధరణ, ఢిల్లీ డిక్లరేషన్ తదితర అంశాలపై చర్చించేందుకు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.