దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. నగరంలో ఎప్పుడూ ఉండే కాలుష్య వాతావరణానికి శీతాకాలంలో కురిసే పొగమంచు తోడైంది. పొగమంచులో దుమ్మదూళి రేణువులు పేరుకుపోయి కాలుష్యం పెరుగుతున్నది. పైగా పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో వచ్చే పొగలు ఢిల్లీ కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.
బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నదని, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. తీవ్ర కాలుష్యం కారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటిందని వెల్లడించింది. అశోక్ విహార్ ఏరియాలో 405గా, జహంగీర్‌పురి ఏరియాలో 428గా, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం దగ్గర 404గా, ద్వారకా సెక్టార్ 8 వద్ద 403గా ఏక్యూఐ ఉన్నదని సీపీసీబీ ప్రకటించింది.