నేడు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఫార్చున్ ఇన్ హోటల్లో వైయస్ఆర్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు డైమండ్ పార్క్ నుంచి రైల్వే న్యూ కాలనీ, మనోహర థియేటర్, దుర్గాలమ్మ గుడి, జగదాంబ జంక్షన్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 2:30 గంటలకు టౌన్ కొత్త రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు.