నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర సాగనుంది. బనగానపల్లె ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో ముస్లిం మైనారిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఒంటిగంటకు వైయస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా పెట్రోల్ బంకు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, మంత్రులు నారాయణ స్వామి, అంజాద్ భాషా, మాజీ మంత్రి పార్థసారథి హాజరుకానున్నారు.