నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు.. ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం..గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రజల కోసం పనిచేస్తున్నా.. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మందిని కలిసి చర్చిస్తా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతా.. 25వ తేదీన ఉదయం నా సతీమణి సుజిత ఉప్పుటూరులో పెద్ద కుమార్తె హైందవి కోడూరు పాడు గ్రామం నుంచి.. చిన్న కూతురు వైష్ణవి.. దొంతాలి గ్రామం నుంచి.. ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
ఇక, వీళ్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో నేను పర్యటిస్తా.. మీడియా కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తాను అని వెల్లడించారు కోటంరెడ్డి.. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తేనే ప్రజలు నాతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుతారని తెలిపారు.. అయితే, తన కార్యక్రమంలో అప్పుడప్పుడు మీడియాతో అనుభవాలు పంచుకుంటానని చెప్పుకొచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. కాగా, గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీకి దగ్గరయ్యారు.. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయనతో పాటు మరికొందరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసిన విషయం విదితమే.