ప్రొబేషన్ డిక్లరేషన్ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా చేసి ఎస్‌ఆర్‌లు ఓపెన్ చేయాలని, సచివాలయ ఉద్యోగులు మాదిరిగానే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, గ్రామ, వార్డు సచివాలయ జాబ్ చార్ట్ అనుసరించేవిధంగా ఆదేశాలివ్వాలని, ఎనర్జీ సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇప్పటి వరకు అమలు కాని సీఎల్, ఈఎల్, మెడికల్ ఇతర సెలవులను సచివాలయ ఉద్యోగులు మాదిరిగా అమలు చేయాలని, ఈహెచ్‌ఎ్‌స హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, తమకు కేటాయించిన సచివాలయాల పరిధిలోనే పనిచేసేవిధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి 29 వరకు ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాసే కార్యక్రమాన్ని చేపడతామని, డిసెంబరు 4,5 తేదీల్లో ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు, 11,12 తేదీల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, 15,16 తేదీల్లో కలెక్టర్లకు, 18నుంచి23 వరకు నల్లరిబ్బన్ ధరించి విధులకు హాజరవడం, డిసెంబరు 26 నుంచి సచివాలయ కేంద్రంగానే విధులు నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు.