వైసీపీలో 27 దళిత స్కీములని రద్దు చేశారని, 27 మంది దళిత ఎమ్మెల్యేలు నోరు మెదపకుండా కుక్కిన పేనుళ్లా కిమ్మనకుండా బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తపరిచారు. దళితుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ప్రసాదించిన గొప్పవరం రాజకీయ రిజర్వేషన్ అని చెప్పుకొచ్చారు. రాజకీయ రిజర్వేషన్లతో ఎమ్మెల్యేలుగా గెలిచి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటున్న దళిత ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం అంబేద్కర్ ఆత్మ క్షోభించేలా చేస్తుందన్నారు. రాష్ట్రంలో దళితులు ఏమాత్రం బాగుపడాలన్నా నియంత లక్షణాలున్న వైసీపీ ప్రభుత్వంను సమాధి చేయాల్సిందే అని దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.