కాకినాడలో కొలువై ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసంలో ఏకాదశి పర్వదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలోని క్యూ లైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. తె.జా. 2 గంటల నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు తిరుమలలో ఈ నెల 24న సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 4.45 గంటల నుంచి తిరుమాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa