ప్రొద్దుటూరు పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే భరిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్ పోర్టు, వీసాను తెప్పించానని వివరించారు. పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించానన్నారు. రష్యా ఏషియన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్ సీటు రావడంతో వాత్సల్యశ్రీ తనను కలిసిందని, తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానన్నారు.