వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... వరుణ దేవుడి ఆశీస్సులు, వైయస్సార్ ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన మమ్మల్ని మంత్రులుగా చేసిన జగనన్న. జగనన్న ఆలోచనా విధానం దూరదృష్టి కలిగి ఉంది. ఆరోజు ఫ్యాన్ గాలి 151 స్పీడుతో వీచింది. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నాం. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన సంక్షేమ ఫలాలు అనుభవించాం. ఈరోజు ఫ్యాన్ గాలి ఇంకా ఎక్కువ వీస్తోంది. 175 స్పీడ్తో వీస్తోంది. జగనన్న సీఎం అయితేనే మన పిల్లల తలరాతలు మారతాయి. 5 రాష్ట్రాల మేనిఫెస్టోల్లో జగనన్న హామీలు చోటుచేసుకున్నాయి. రాజస్తాన్లో ఓ పార్టీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడతామంటున్నారు. పక్క రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తెస్తామంటున్నారు. ఇవన్నీ మనకు నాలుగేళ్ల కిందటే వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలంటే జగనన్నను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు.