వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... దేశంలో బీసీ నాయకుడిగా అన్ని రాష్ట్రాలూ తిరిగాను. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు మమ్మల్ని ఏపీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే, అక్కడి పిల్లలు అందరూ మంచి చదువులు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి హోటళ్లలో పెట్రోలు బంకుల్లో పని చేస్తున్నారని చెప్పారు. ఏపీలో అమ్మ ఒడి ఉంది, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉందంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బీసీ సీఎంలు ఉన్నా అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్లు, గురుకులాలు లేవు. కానీ సీఎం జగన్ పేద పిల్లలు విదేశీ చదువులు చదువుతున్నా సాయం చేస్తున్నారు. 10, 20 ఏళ్ల తర్వాత ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలందరూ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసేలా ఎదుగుతారు. సీఎం జగన్..పేదవర్గాల విద్యార్దులు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలని అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివి ప్రవేశపెట్టి మంచి చదువులు చదివిస్తున్నారని, ఇతర రాష్ట్రాలు మమ్మల్ని ఏపీలో కలపాలంటున్నారు. అధికారంలో, సంపదలో, ఆస్తిలో బీసీలకు వాటా ఇచ్చిన సీఎం జగన్. ఎంపీలుగా ఐదుగురు బీసీలకు అవకాశం ఇచ్చారు. మామూలు కుటుంబంలో పుట్టిన నన్ను రాజ్యసభకు పంపారు. పేద కులాల గురించి కొట్లాడాలని చెప్పాడు. పేద కులాలను పదవులిచ్చి నాయకులుగా తయారు చేసిన జగనన్నకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది అని తెలియజేయారు.