వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంఎల్ ఏ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... పేద, బడుగు వర్గాల కోసం సామాజిక సాధికారత సాధించిన ఘనత జగనన్నది. పేద, బడుగు వర్గాలను సమానంగా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఈబీసీలకు ఎన్నో పథకాలిచ్చారు. ప్రతి కుటుంబం ఇంట్లో జగనన్న బొమ్మ పెట్టుకొనేలా చేశారు. రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి పేదవారు, మధ్య తరగతి గుండెల్లో నిలిచిపోయారు. వైయస్సార్ చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్నగారి ఫొటో ఉంది. రేపు ప్రతి ఇంట్లో నా ఫొటో పెట్టుకొనేలా చేస్తానని జగనన్న చెప్పారు. చంద్రబాబు అప్పులు చేసి ఆ డబ్బంతా తెలుగుదేశం కార్యకర్తలకు, జన్మభూమి కమిటీలకు దోచిపెట్టాడు. ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చిన జగనన్న. మాట తప్పడు, మడమ తిప్పడు. ఒంగోలులో రూ.350 కోట్లతో మంచి నీటి పథకం తెచ్చాం. త్వరలో సీఎం ఒంగోలు వస్తారు. ఆ పథకాన్ని శంకుస్థాపన చేస్తారు. రిమ్స్ ఏర్పాటు చేశాం. కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.90 కోట్లతో పోతురాజు కాల్వ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రూ.200 కోట్లు రోడ్లు, డ్రెయిన్లకు ఖర్చు పెట్టాం. ఒంగోలులో 25 వేల ఇంటి పట్టాలిస్తామని చెప్పాం. కానీ టీడీపీ కోర్టులో కేసు వేయడంతో ఆగిపోయింది. ఈ నెలలో డబ్బులు పడతాయి. వచ్చే నెలలో పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇవ్వకపోతే నేను ఒంగోలు నుంచి పోటీ చేయను అని సవాల్ చేసారు.