వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ... మనమంతా జగనన్న కుటుంబానికి చెందినవారం. అలా చెప్పుకుంటుంటే ఎంత గర్వంగా ఉంటుందో!జగనన్న సామాజిక సాధికారత అంటే...చంద్రబాబు నా కుల సామాజిక సాధికారత అని ఆలోచించే వ్యక్తి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలు అభివృద్ధిలోకి వచ్చేందుకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య,వైద్యం వంటి రంగాల్లో హద్దులు లేకుండా అవకాశాలు కల్పించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.విద్యారంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమార్పులు పేదల పిల్లలకు, అణగారిన కుటుంబాల పిల్లలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. డబ్బున్న వాళ్ల పిల్లలకు తీసిపోని రీతిలో...ఈనాడు మన పిల్లలు చదువుతున్నారంటే ఎంతో గర్వించాల్సిన విషయం. అలాగే వైద్యరంగంలోనూ పేదలకు గణనీయమైన వైద్యసేవలు అందుతున్నాయి. కుట్రలు, కుతంత్రాల రాజకీయం చేసే చంద్రబాబు నక్కలాంటివాడు అయితే...పేదల సంక్షేమం కోసం ఎందాకైనా అనే సింహంలాంటివాడు జగనన్న. ఈరోజున ఒక్క బనగానపల్లె నియోజకవర్గంలోనే డీబీటీ ద్వారా నేరుగా 1,83,197 మంది బీసీ లబ్దిదారులకు రూ.409.30 కోట్లు అందాయి. 95,737 ఎస్సీ లబ్దిదారులకు రూ.306.44 కోట్లు, 14,956 మంది ఎస్టీ లబ్దిదారులకు 24.85 కోట్లు అందాయి. ఏ ఒక్కరూ పేదలుగా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో సంక్షేమఫలాలు నేరుగా, పారదర్శకంగా ఇంటింటికి చేర్చిన ది గ్రేట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పచ్చమీడియా సంస్థలకు చెందిన యజమానులు నాలుగుపడగల నాగుపాములా జగనన్నపై విషం చిమ్ముతున్నారు. ఆ నాలుగు పడగల పాముకు చంద్రబాబు సీఎం కావాలన్నదే లక్ష్యం. అది పగటికలగానే మిగిలిపోయేలా చేద్దాం అని పిలుపునిచ్చారు.