వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..... నలభైఏళ్ల రాజకీయాల అనుభవం వుందని చెప్పుకుంటూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు పేదలకు, అణగారిన వర్గాలకు చేసింది ఏమీలేదు. ఈ నాలుగున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు ఎంత మేలు చేశారు. సంక్షేమ పథకాలు లెక్కలేనన్ని తెచ్చారు. పెన్షన్ల విషయంలో విప్లవాన్నే తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల విషయాల్లో జగనన్నకు, చంద్రబాబుకు పోలికే లేదు.గతంలో ఇంటికో ఉద్యోగం, బాబొస్తే జాబు వస్తుంది అంటూ ప్రతి ఇంటి గోడలమీద రాసి, ప్రచారం చేసుకున్న చంద్రబాబు ...అధికారంలో వచ్చి ఇచ్చిన జాబులే లేవు. లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగనన్న హయాంలో వచ్చాయి.అణగారిన వర్గాలు రాజ్యాధికారంలో భాగమైతేనే అభివృద్ధి చెందుతాయని, తన మంత్రి వర్గంలో ఐదుపదవుల్ని ఎస్సీలకే ఇచ్చారు. శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎస్సీ వర్గం నుంచే ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో సింహభాగం ఇచ్చిన మనసున్న మనిషి ముఖ్యమంత్రి జగనన్న అని తెలిపారు.