వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ... జగనన్న ...నాయకుడంటే సేవకుడు అనే పంథాలో పాలన సాగిస్తున్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్..ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలంతా నా మనుషులు’ అంటూ, ఆయా వర్గాలను సొంతం చేసుకున్నారు సీఎం జగన్. నిన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాజకీయపార్టీలు ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుని వదిలేయగా, వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రభుత్వ పథకాలతో పాటు రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కేటాయించింది. సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. ఓవైపు సామాజిక న్యాయం పాటిస్తూనే, మరోవైపు నేరుగా అణగారిన కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో పదివేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇదే బనగానపల్లెలో మూడువేలమందికి ఇళ్లపట్టాలిచ్చాం. ఇక్కడ ఇచ్చిన పట్టాలపై స్టే తీసుకొచ్చిన దుర్మార్గుడు ఇక్కడి టీడీపీ నాయకుడు. ఇది టీడీపి రాజకీయం. ప్రజల మంచికోసం నిరంతరం పనిచేసే పార్టీ మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసారు.