ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకూ విజయవాడ డివిజన్లో భద్రతా పనుల వల్ల పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ రద్దైంది. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్.. మచిలీపట్నం-విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు కానున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 4 వరకూ మూడు రైళ్లు రద్దు కానున్నాయి. వాటిలో రాయగడ-గుంటూరు ఎక్స్ప్రెస్.. విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్.. విశాఖ-మచిలీపట్నం ఎక్స్ప్రెస్లు రద్దు కానున్నాయి. ఇక నవంబర్ 27, 28, 29, డిసెంబర్ 1, 2 తేదీల్లో 2 రైళ్లు రద్దు కానున్నాయి. విజయవాడ-విశాఖ రైలు.. విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ రద్దు కానున్నాయి. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు 2 రైళ్లు రద్దు చేయడం జరిగింది. కాకినాడ-విశాఖ మెమూ స్పెషల్ రైలు... విశాఖ-కాకినాడ మెమూ స్పెషల్ రైలు రద్దు చేయడం జరిగింది.