టీడీపీ, జనసేన పార్టీలు కలిసి విడుదల చేసే పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలు రాష్ట్రం నుంచే పరార్ అవుతారు’ అని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ...... మేం పేదల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఎందుకు కడుపు నొప్పి? మా అంకిత భావం తెలియడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో బాండ్లను ఇంటింటి అందచేస్తున్నాం. ఈ బాండ్లను డిజిటల్ రూపంలో ఆన్లైన్లోకి ఎక్కిస్తున్నాం. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బాండ్లలో నమోదు చేయించుకొన్న వారికి ప్రభుత్వ సాయం అందుతుంది అని చెప్పారు.