గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆధ్వర్యంలో ఓట్ల తొలగింపు జరుగుతోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే మద్దాలి గిరిధర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తల్లిలా ఆదరించిన తెలుగుదేశం పార్టీకి గిరి ద్రోహం చేస్తున్నారని అన్నారు. వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలతో గిరి ఫాం 7 దరఖాస్తు చేయించారన్నారు. వైసీపీకి ఓటు వేయని రెండు సామాజిక వర్గాల ఓట్ల తొలగింపే వారి లక్ష్యంగా ఫాం 7 అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తనకూ ఓట్లేసి గెలిపించిన వారి ఓట్లు తొలగించడానికి గిరి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త్ం చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు.