బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంద్రప్రదేశ్‌లో నెగటివ్ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ, జగన్ కలిసే జైలుకు పంపారని విమర్శించారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఇదివరకే చెప్పాం అని అన్నారు. బీజేపీ కూడా ఒకానొక సమయంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, తమకు ఇప్పుడు ఇద్దరే ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయినా మేము ప్రజల తరుపున నిలబడి పోరాడతామని, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారని అన్నారు. ఎంతో మంది ఆంధ్రులు కమ్యూనిస్టులుగా ఆత్మగౌరవం కోసం పోరాడారని, మీలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడమని రామకృష్ణ స్పష్టం చేశారు.