ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ యువకుడిని హతమార్చిన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ నెల 20న గోమ్ గ్రామంలో అమర్సింహా(29) అనే యువకుడిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
అనంతరం గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని ఆరోపించి దారుణంగా నరికి చంపారు. మంగళవారం రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి దానిపై కరపత్రాలు విసిరారు.