పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండొనేషియా, థాయ్‌లాండ్ ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని ఇటీవల నిర్ణయించింది.
2023 సంవత్సరానికి గానూ మొత్తం 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని శ్రీలంక ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024, మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.