ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం & పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27వ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తాయని.. రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషానికి వస్తే ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. మరోవైపు.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
మరోవైపు రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఇక, రేపు మరియు ఎల్లుండి అయితే, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.