భారతదేశంలో ఆఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగానే న్యూఢిల్లీలోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆఫ్గాన్ రాయబార కార్యాలయం తెలిపింది.
కాగా, సెప్టెంబర్ 30వ తేదీన ఆఫ్గాన్ ఎంబసీ కార్యకలాపాలను అంతకు ముందు నిలిపివేశామని ఆఫ్గాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ తెలిపారు.