కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేందుకు సీఎం జగన్ జీవోలు ఇస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 'ఐటీ అభివృద్ధికి కట్టిన మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు.
రూ.వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను తరిమేస్తున్నారు. రుషికొండను ధ్వంసం చేశారు. కైలసగిరిని నాశనం చేశారు. జగన్ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు' అని లోకేశ్ ఫైర్ అయ్యారు.