ప్రపంచ యాత్రికుడు, తెలుగు యూట్యూబర్ అన్వేష్ కు తాను రూ.5 కోట్లు ఇచ్చానని జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు.
'వైసీపీ ఇచ్చే రూ.5 పేటీఎం కోసం కొందరు ప్రశ్నిస్తున్న వారిని నిందిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై 'నా అన్వేషణ' ఛానెల్ చేసిన వీడియో ప్రశంసించదగినది' అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.