జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. షోపియాన్లో ఉష్ణోగ్రత మైనస్ 3.3 డిగ్రీలకు పడిపోయింది. కశ్మీర్ లోయలో అత్యంత శీతల ప్రాంతం ఇదేనని అధికారులు గురువారం వెల్లడించారు.
శ్రీనగర్ పట్టణంలో మైనస్ 0.8 డిగ్రీలు, పుల్వామాలో మైనస్ 2.1 డిగ్రీలు, దక్షిణ కాశ్మీర్లోని టూరిస్ట్ రిసార్ట్లో మైనస్ 1.8 డిగ్రీలు, ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్ రిసార్ట్లో మైనస్ 0.4 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన చెప్పారు.