ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. నంబులపూలకుంట మండలం, ఎదురుదొన గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి, డీబీటీ ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తుల వివరాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజలకు ఎంత లబ్ధి చేకూరినదో తెలియపరిచే డిస్ప్లే బోర్డు గూర్చి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. కుటుంబాన్ని సందర్శించినప్పుడు ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరినదో తెలియజేసి మళ్లీ జగనన్న అధికారంలోకి రావాలి అంటే మనందరి మద్దతు కావాలని ప్రజల మద్దతును సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల అధికారులు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, జె సి ఎస్ ఇన్చార్జులు, సర్పంచులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు