విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచే సీఎం వైయస్ జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని.. 50 ఏళ్ల క్రితం విశాఖను రాజధానిగా చేయాలనుకున్నారని మంత్రి చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తించి.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే గానీ అభివృద్ధి చెందదని భావించారన్నారు. కోర్టులలో ఓ పక్క పోరాటం చేస్తూనే.. మరో వైపు పరిపాలన, సమీక్షలు చేయడానికి కార్యాలయాలు చూశారని ఆయన చెప్పారు.