గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా విధులు అప్పగించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మహిళ పోలీసులుగా మారుస్తూ జారీ చేసిన GOను సవాల్ చేస్తూ న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మహిళలకు పోలీసుల బాధ్యతలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బాలాజీ యలమంజుల పిటిషన్ వేశారు. మహిళా కార్యదర్శులకు పోలీసుల బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టులో నర్రా శ్రీనివాస్, బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.