తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం ఇసుక లోడింగ్ పాయింట్ దగ్గర రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇసుక పడవలు, లారీ ఓనర్స్ మధ్య రేటు విషయంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇసుక లోడింగ్ పాయింట్ దగ్గర లారీ డ్రైవర్స్, ఓనర్స్ ఆందోళనకు దిగారు. తాడేపల్లిగూడెం-నిడదవోలు రహదారిపై సుమారు 60 లారీలను నిలిపివేశారు. సొంత లారీలకు ఒక రేటు, బయట లారీలకు ఒక రేటుతో పడవ యజమానులు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ రేటు ప్రకారం 10 టన్నులకు రూ.6200 రేటు నిర్ణయించగా ఇసుక మాఫియా మాత్రం రూ. 9200 వసూల్ చేస్తున్నారు. బిల్లు మాత్రం రూ.6200కి ఇస్తూ.. అదనంగా రూ. 3 వేలు రూపాయలు వసూలు చేస్తున్నారంటూ లారీ ఓనర్స్ ఆందోళనకు దిగారు. ఇంత జరిగినా ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.