అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు(ఐఆర్‌ఆర్) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు లాయర్ల అభ్యర్థనతో ఈనెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 30కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు పూర్తికాగా.. పిటిషనర్ తరఫున మౌకిక వాదనల్ని రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు జడ్జి సూచించారు.ఈ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ మూడు కేసుల్లో విచారణ దాదాపుగా ఈ నెలాఖరుకు వాయిదా పడిందని చెప్పాలి.