ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 06:46 PM

 వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విశాఖపట్నానికి వస్తారని చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ ఎస్ఎన్ రాజు తెలిపారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘విశాఖలో పవన్ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి పవన్ రావలసిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో ఏయిర్‌పోర్టు అధికారులు పవన్ విశాఖ పర్యటనను రద్దు చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. పవన్‌ను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు పన్నినా.. విశాఖకు రావడం ఖాయం. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ నష్టపరిహారం ఇస్తారు’’ అని కేవీ ఎస్ఎన్ రాజు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com