తూర్పు గోదావరి జిల్లాలో శిరోముండనం చేసిన వరప్రసాద్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకించారని వరప్రసాద్‌కు శిరోముండనం చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులు అందరిపై SC, ST వేధింపుల నిరోధక చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నిందితులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం విధించిన స్టే ఎత్తి వేయాలంటూ న్యాయస్థానంలో బాధితుడు వరప్రసాద్ పిటిషన్ చేశారు. వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.