ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని జెడ్పి హైస్కూల్ హెచ్ఎం పి దుర్గాప్రసాద్ అన్నారు. బాపట్ల మండలం వేటపాలెం జెడ్పి హైస్కూల్ నందు వినియోగదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి డి ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మేలుకొలుపు సదస్సు ఏర్పాటు చేశారు.
వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయని, వాటి నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.