వైజాగ్ మీకు ఏం అన్యాయం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. శాఖలకు నగరంలో భవనాల కేటాయింపును అందులో వివరించారు. దీనిపై ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈ ప్రాంత ప్రజలందరి తరపున సీఎం వైయస్ జగన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే దీనిపై ఎల్లో మీడియా మాత్రం నిన్నటి నుంచి విషం కక్కుతోంది. ఉత్తరాంధ్ర అసలు ఈ రాష్ట్రంలో లేనట్లు, ఈ ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతోందని ధ్వజమెత్తారు.