ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కారంపూడి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన ప్రసాదరావు(48) ట్రాన్స్‌పోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
ఆయన భార్య, కుమార్తె అనారోగ్యంతో గతంలో మృతి చెందారు. మరోవైపు వ్యాధులతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేశారు.