కాకినాడ జిల్లా, తునిలో ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తుని ఆర్అండ్బి అతిథి గృహంలో వైయస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.