నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో వైసీపీ సామాజిక సాధికార యాత్ర ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన జనం ..జైజగన్ అంటూ సభాస్థలిని హోరెత్తించారు. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీసీఎం అంజాద్‌బాషా, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ లతో పాటు ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.