విజయనగరం జిల్లా, శృంగవరపుకోట: వేపాడ మండలం ముకుందపురం కు చెందిన సూరాతి పోలమ్మ (75) అంధురాలు. ఈమెకు గత మూడేళ్ల క్రితం వరకు పెన్షన్ అందేది. పెన్షన్ పంపిణీని ఆన్లైన్ ద్వారా చేపట్టడంతో ఈమె అంధురాలు కావడం, వృద్ధాప్యం కారణంగా చేతి వేళు ముద్రలు పడలేదనే కారణంగా అధికారులు ఈమె పెన్షన్ను తొలగించారని చెబుతోంది.
దీంతో పెన్షన్ రాక ఆకలితో అలమటిస్తున్నానని, అధికారులు చొరవ చూపి, పెన్షన్ ఇప్పించాలని ఆమెతో పాటు పలువురు కోరుతున్నారు.