నవంబర్ 25న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘నో నాన్-వెజ్ డే’గా ప్రకటించింది. ప్రఖ్యాత భారతీయ విద్యావేత్త, సాధు తన్వార్ దాస్ లీలా రామ్ వాస్వానీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ‘వెజ్ డే’ జరుపుకోవాలని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నాన్ వెజ్ వంటకాలు చేసుకోరు.