అమెరికాకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కెన్ఓమ్కు వింత కోరిక పుట్టింది. తాను చనిపోయాక తన డీఎన్ఏను అంతరిక్షంలోకి పంపాలని అనుకుంటున్నారట. దాని కోసం తన డీఎన్ఏను ఉపయోగించి క్లోనింగ్ ద్వారా తనలాంటి వ్యక్తినే రూపొందించనున్నారు.
ఆ క్లోనింగ్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. దాంతో గ్రహాంతర జీవులకు మానవుడు ఇలా ఉంటాడని చూపించాలని ఆశట. సెలెస్టిక్ అనే సంస్థ ద్వారా వచ్చే క్రిస్మస్ నాటికి తన క్లోనింగ్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నారు.