తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సంఘం అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.
నిధులను దారిమళ్లించడాన్ని కేంద్ర బృందాలు ధ్రువీకరించాయని రాజేంద్రప్రసాద్ అన్నారు. నిధుల దారిమళ్లింపుపై కేంద్రం సంజాయిషీ కోరినా స్పందన లేదని అన్నారు. ఉద్యమాలపై సమీక్ష చేసి రెండో విడత పోరాటాలు ఉధృతం చేస్తామని లక్ష్మి అన్నారు.