ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ రూ.40 కోట్ల జరిమానా విధించింది.
ముందస్తు అనుమతి లేకుండా ఐబీఎస్‌ఈపీఎల్ నుంచి ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు రూ.200 కోట్లు మళ్లించడంపై ఈడీ విచారణ జరిపింది. ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న రూ.40 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.