విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో బాధిత మత్స్యకార కుటుంబాలకు టీడీపీ ఆర్థికసాయం ప్రకటించింది. బోట్లు కోల్పోయిన వారికి రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేలు, కళాసీలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ పార్టీ స్టేట్ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులకు కొత్త బోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు.